ETV Bharat / state

కొవిడ్ కష్టాలు: పరిచయం ఉంటే వెంటనే పరీక్ష.. లేదంటే నిరీక్షణే! - హుస్నాబాద్​ తాజా వార్తలు

హుస్నాబాద్​ ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షల నిర్వహణ విమర్శలకు దారితీస్తోంది. వైద్య సిబ్బంది తమకు పరిచయం ఉన్న వారికి త్వరగా పరీక్షలు నిర్వహించి.. మిగిలిన వారిని సరిగా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

chaotic-conduct-of-corona-examinations-in-husnabad-government-gazette
హుస్నాబాద్​ ప్రభుత్వాసుపత్రిలో అస్తవ్యస్తంగా కరోనా పరీక్షల నిర్వహణ
author img

By

Published : Aug 31, 2020, 2:57 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హుస్నాబాద్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల నుంచి వందల సంఖ్యలో అనుమానితులు ఆసుపత్రికి వస్తున్నారు. కనీస జాగ్రత్తలు మరిచి గుంపులు గుంపులుగా లైన్లలో నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోనే కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

పట్టించుకోవడం లేదు..

మరోవైపు పరీక్షల కోసం వస్తే గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బందికి పరిచయం ఉన్నవారికి త్వరగా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. మిగిలిన వారిని సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

మరోవైపు పరీక్షల అనంతరం పాజిటివ్​గా నిర్ధారణ అయిన బాధితులు వైద్య సిబ్బంది ఇచ్చిన మందులతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. దీంతో వారితో పాటు మరికొందరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

chaotic-conduct-of-corona-examinations-in-husnabad-government-gazette
పరీక్షల కోసం పడిగాపులు

ఇదీచూడండి.. క్షీణించిన ప్రణబ్​ ఆరోగ్యం: ఆర్మీ ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.