ETV Bharat / state

పంటలు ఎండిన రైతులకు రుణాలు మాఫీ చేయాలి: చాడ - చాడ వెంకటరెడ్డి తాజా వార్తలు

హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ఎండిపోయిన పంట పొలాలను చాడ వెంకటరెడ్డి పరిశీలించారు. ఇటీవల పంట ఎండిపోయి.. ఆత్మహత్యకు పాల్పడిన సంపత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంటలు ఎండిపోయి అప్పులపాలైన రైతుల రుణాలు, వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్​ చేశారు.

Chada Venkat reddy, Husnabad, Akkannapet
చాడ వెంకటరెడ్డి, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలు, సిద్దిపేట
author img

By

Published : Apr 5, 2021, 8:00 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లోని రైతులు.. తమ పంటపొలాలు పూర్తిగా ఎండిపోయి అప్పులపాలవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే దీనికి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన కందుకూరి అంజయ్య అనే రైతుకు చెందిన ఎండిపోయిన పంటను పరిశీలించి.. ధైర్యాన్ని కల్పించారు. అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో ఇటీవల పంట ఎండిపోయి.. ఆత్మహత్యకు పాల్పడిన సంపత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ.. మెట్ట ప్రాంత రైతులను సీఎం కేసీఆర్​ మరచిపోయారని చాడ దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సిద్దిపేట జిల్లాలో పంటలు ఎండి.. అప్పులపాలైన రైతుల రుణాలు, వడ్డీలు మాఫీ చేయాలన్నారు. కొత్త రుణాలు మంజూరు చేయాలని చాడ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఈ నెల 8న సీఎంలతో ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.