సెర్చ్ వారెంట్ లేకుండా భాజపా అభ్యర్థి రఘునందన్ ఇంట్లో సోదాలు చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మహిళలు, పిల్లలపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని ఆగ్రహించారు. సిద్దిపేట కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఇప్పటికే బదిలీ చేసిందన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినందుకే కలెక్టర్‌పై చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. బండి సంజయ్‌పై పోలీసుల తీరును ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దుబ్బాకలో భాజపా గెలుస్తుందనే తెరాస ఈవిధంగా చేస్తోందన్నారు.
ఇదీ చదవండి: సిద్దిపేటలో రూ.18.67 లక్షలు స్వాధీనం