ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. నిన్న మిలియన్ మార్చ్‌లో జరిగిన లాఠీచార్జీ ఘటనను నిరసిస్తూ సిద్దిపేట బస్ డిపో ఆవరణలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి దీక్ష చేపట్టారు.
మహిళలని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని... తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: 12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష