Harish Rao respond on Congress SC ST declaration : చేవెళ్ల సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై (Congress SC ST declaration) బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. హస్తం పార్టీ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ ప్రకటిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ముందుగా ఏ డిక్లరేషన్ చేసినా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పింఛను లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు (Harish Rao) బీడీ టేకేదార్లకు నూతన పింఛను మంజూరు.. దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జూనియర్ పంచాయితీ కార్యదర్శిల ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను ఆయన అందజేశారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే ఎక్కడా పింఛను ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచారని.. గృహలక్ష్మి(Gruha Laxmi Scheme) పథకంలో వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో 167 మంది జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 5 గ్రామాలకు ఒక సెక్రటరీ ఉండేవారని గుర్తు చేశారు. పంచాయతీ సెక్రటరీలు నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలన్నారు. ఇన్ని చేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని హరీశ్‌రావు కోరారు.
"కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పింఛను లేదు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే ఎక్కడా పింఛను ఇవ్వడం లేదు. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్. జిల్లాలో 167 మంది జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తున్నాం కాంగ్రెస్ హయాంలో 5 గ్రామాలకు ఒక సెక్రటరీ ఉండేవారు. పంచాయతీ సెక్రటరీలు నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలి." - హరీశ్‌రావు, మంత్రి
కాంగ్రెస్ నేతలు తప్పుడు డిక్లరేషన్ ప్రకటించారని.. హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు . ఈ ఎస్టీ డిక్లరేషన్ కుట్రపూరితమేనని విమర్శించారు. తెలంగాణ చైతన్యవంతులైన ఎస్సీ, ఎస్టీలు హస్తం పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తానికి ఇదే డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇదే దీనిని అమలు చేస్తారా అని సత్యవతి రాఠోడ్ నిలదీశారు.
- Harish Rao Tour in Rangareddy District : 'దీపం లాంటి కేసీఆర్ ఉంటుండగా.. కాంగ్రెస్, బీజేపీ కావాలా?'
దేశంలో దళితుల, గిరిజనుల వెనుకబాటుకు కాంగ్రెస్ కారణమని సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. మాయమాటలు చెబుతున్న హస్తం పార్టీ, బీజేపీలకు డిపాజిట్ రాకుండా ఓడించాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల మందికి పోడు పట్టాలు ఇచ్చారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. మరోవైపు ఈ డిక్లరేషన్ చెత్తకుండీలో వేయడానికి పనికి వస్తుందని ఎంపీ కవిత ఎద్దేవా చేశారు. ఇలాంటివి చేసి అబాసుపాలు కావద్దన్నారు. డిక్లరేషన్ పేరిట మోసపూరిత హామీలు ఇవ్వడం మల్లికార్జున ఖర్గే తగదని.. ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ తెలిపారు. అదొక డమ్మీ డిక్లరేషన్‌గా ఆయన అభివర్ణించారు.
Harish Rao on BJP and Congress : 'బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయి'