రాబోయే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని... ఆ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శంచారు. భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పట్టణంలోని పలు సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పోరాటం చేయాలని తీర్మానం చేశారు.
ఇదీ చదవండి: పిల్లల్ని పంపించటం పూర్తిగా తల్లిదండ్రుల నిర్ణయమే: సబిత