ETV Bharat / state

హుస్నాబాద్​లో బండి సంజయ్​ పర్యటన - హుస్నాబాద్​లో పర్యటించిన బండి సంజయ్​ వార్తలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమార్​ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

bjp state president bandi sanjay toured at husnabad in siddipet district
హుస్నాబాద్​లో బండి సంజయ్​ పర్యటన
author img

By

Published : Jun 12, 2020, 5:21 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కుమార్​ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 8, 11 వార్డుల్లో ఎంపీ నిధుల నుంచి మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

భాజపా ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకొని.. ఆ దిశగా పార్టీ కార్యకర్తలందరం కృషి చేస్తున్నామని సంజయ్​ పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండాగా ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో పని చేయాలన్నారు.

కరీంనగర్​లో భాజపా కార్పొరేటర్లు పార్టీ మారటం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న ఆయన.. ఇన్నాళ్లుగా జరగని అభివృద్ధి ఏడాదిలో జరుగుతుందని అనుకోవడం వారి భ్రమ అన్నారు. డబ్బుల కోసం ఆశపడి పార్టీ మారుతున్న వారికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్​కుమార్, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

హుస్నాబాద్​లో బండి సంజయ్​ పర్యటన

ఇదీచూడండి: పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై చర్యలొద్దు: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.