ETV Bharat / state

భాజపా కలెక్టరేట్​ ముట్టడి సందర్భంగా ఉద్రిక్తత - తెలంగాణ వార్తలు

ఉద్యోగుల పీఆర్సీ తదితర సమస్యలపై నిరసిస్తూ.. భాజపా చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టర్ కార్యాలయం లోపలికి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కి తరలించారు. కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా భాజపా నాయకులు నినాదాలు చేశారు.

BJP siege office siege tension in siddipet
భాజపా కలెక్టరెట్​ ముట్టడి: ఉద్రిక్తం
author img

By

Published : Jan 29, 2021, 5:07 PM IST

ఉద్యోగుల పీఆర్సీ 7.5 ఫిట్మెంట్, నిరుద్యోగ భృతి, పెన్షన్ దారుల హక్కులకు వారికి మద్దతుగా భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. భాజపా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకోటంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.

సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా భాజపా నాయకులు నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం లోపలికి చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించిన నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కి తరలించారు.

"ఉద్యోగులకు ఇవ్వాల్సిన 43శాతం ఫిట్​మెంట్​ను కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరికి 7.5శాతం ఇస్తామని చెప్పడం చాలా దారుణం. ఉపాధ్యాయ, ఉద్యోగుల నోట్లో మన్నుకొట్టేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ.. అటూ కోర్టుల్లో కేసులు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి.. వెంటనే నిరుద్యోగ భృతి అందించాలి. ఉద్యోగులకు భాజపా ఎప్పుడు అండగా ఉంటుంది"

-- దూది శ్రీకాంత్ రెడ్డి. భాజపా జిల్లా అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.