సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి భాజపాతోనే సాధ్యమవుతుందని తెలిపారు.
దుబ్బాకలో ఒక యుద్ధం జరుగుతోందన్నారు. పేదప్రజలకు ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించారో మంత్రి హరీశ్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస కార్యకర్తలకే ఇళ్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.