సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట భాజపా కార్యకర్తలు నిరసనకు దిగారు. గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన ఓ రైతు ప్రభుత్వ నిరంకుశత్వానికి భూమిని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడని... అందుకు నిరసనగానే తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాకి దిగినట్లు నాయకులు తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం తెరాస నియంతృత్వ పోకడకు నిదర్శనమని విమర్శించారు. దళితుల పక్షాన భాజపా నాయకులు నిలబడుతుంటే... తెరాస నిర్బంధాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమాలలో ఆయా మండలాల భాజపా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడం ఇవీ చూడండి: ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!