సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లో చేర్చాలని, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 50 పడకలతో నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్స అందించట్లేదని ఆరోపించారు.
హుస్నాబాద్ ఆసుపత్రికి చుట్టుపక్కల 100 గ్రామాల నుంచి ప్రజలు వస్తారని.. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేక, ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లో చేర్చేలా కృషి చేయాలని, సరిపడా వైద్యులను నియమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.