సిద్దిపేట జిల్లా కేంద్రంలో దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ అబ్జర్వర్‌గా వచ్చిన సరోజ్‌కుమార్ ఠాకూర్‌ను భాజపా నేతలు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డిలు కలిశారు. దుబ్బాకలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. ఈ నెల 26న రఘునందన్‌రావు ఇంటి వద్ద జరిగిన సంఘటనను వివరించామని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై ఠాకూర్ సానుకూలంగా స్పందించారని .. ఘటనపై క్షుణ్నంగా పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు.
తెరాస నాయకులు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని.. భయభ్రాంతులకు గురిచేకుండా చూడాలని సరోజ్కుమార్కు వివరించారు. సీఎం కేసీఆర్ తీరు మార్చుకోవాలని.. ఎలా పడితే అలా దుర్భాషలాడకూడదని జితేందర్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సరోజ్‌కుమార్ ఠాకూర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా తన వాట్సాప్ నెంబర్ 9445437356కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండిః కేంద్ర బలగాలతో దుబ్బాక ఎన్నికలు నిర్వహించాలి: కోమటిరెడ్డి