రాస్తారోకో నిర్వహించిన భాజపా నాయకుల అరెస్ట్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మురుగు కాలువల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ భాజపా నాయకులు అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. మురుగు కాలువల నిర్వహణ సరిగ్గా లేక రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరంతా రోడ్లపైకి, దుకాణాల్లో చేరుతోంది. మురుగు కాలువలకు మరమ్మతులు చేయించి, వర్షపు నీరు నిల్వకాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు అక్కడికి చేరుకుని భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఇదీ చదవండిః హైకోర్టు తీర్పుపై మంత్రి అజయ్ సమాలోచనలు