ETV Bharat / state

'వివేకానందుని ప్రవచనాలు ప్రపంచ దేశాలకు ప్రేరణ'

స్వామి వివేకానందుని ఆశయాలను ఆచరణలోకి తెచ్చి దేశ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని భాజపా కోర్​ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. వివేకానందుని 158వ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

bjp leader enugala peddireddy Prophecies of wisdom inspire the nations of the world
'వివేకానందుని ప్రవచనాలు ప్రపంచ దేశాలకు ప్రేరణ'
author img

By

Published : Jan 12, 2021, 3:48 PM IST

భారతదేశ హైందవ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని భాజపా కోర్​ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. వివేకానందుని 158వ జయంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

వివేకానందుని ప్రవచనాలు నేటికీ ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తున్నాయని పెద్దిరెడ్డి అన్నారు. ఆ మహనీయుని జీవన విధానాన్ని, ఆశయాలను ఆచరణలోకి తెచ్చి దేశ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు భాజపా నాయకులతో కలిసి వివేకానందుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి: 'కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది- యువత రావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.