సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీతో సంజయ్‌కి ఘన స్వాగతం పలికారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్... ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కోహెడ మండలంలోని పెద్ద సముద్రాల గ్రామానికి చేరుకున్న బండి సంజయ్... కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి త్వరగా తొలిగిపోయి ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సంజయ్ ఆకాంక్షించారు.