సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఏ చిన్న అవసరానికైన అంత దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. భవన నిర్మాణ విషయంలో ఇప్పటికైనా ఎమ్మెల్యే పునరాలోచించాలని కోరుతూ... ప్రస్తుతం ఉన్న చోటులోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అడ్డుకొంటామని హెచ్చరించారు. అవసరమైతే మున్సిపల్ డైరెక్టర్‌తో ఎంపీ బండి సంజయ్‌తో మాట్లాడించి పనులను నిలిపివేయిస్తామన్నారు.
- ఇదీ చూడండి: నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్