ఆర్టీసీ బంద్‌కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ర్యాలీ హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం మల్లెచెట్టు చౌరస్తా వద్ద ఆర్టీసీ, విపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కాంగ్రెస్ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విపక్ష, ఆర్టీసీ నాయకులను పోలీసు వాహనాలలో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి : వనపర్తిలో ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు