ETV Bharat / state

Best Tourism Village Chandlapur 2023 : ప్రకృతి రమణీయత.. పర్యాటక వేదిక.. ఉత్తమ టూరిస్ట్ విలేజ్ చంద్లాపూర్‌ గురించి మీకు తెలుసా..? - బెస్ట్ టూరిజం విలేజ్‌ 2023గా చంద్లాపూర్

Best Tourism Village Chandlapur 2023 in Siddipet District : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అందులో రాష్ట్రం నుంచి సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్, జనగామ జిల్లాలోని పెంబర్తిని ఎంపిక చేసింది. ఈ గ్రామాలకు ఈ నెల 27న దిల్లీలో అవార్డులు అందజేయనున్నారు. ఉత్తమ పర్యాటక గ్రామ పోటీల్లో సత్తా చాటిన నేపథ్యంలో చంద్లాపూర్‌ విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం..

Best Tourism Villages Telangana 2023
Best Tourism Village Chandlapur 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 11:15 AM IST

Updated : Sep 26, 2023, 3:45 PM IST

Best Tourism Village Chandlapur 2023 ప్రకృతి రమణీయత.. పర్యాటక వేదిక.. ఉత్తమ టూరిస్ట్ విలేజ్ చంద్లాపూర్‌ గురించి మీకు తెలుసా..

Best Tourism Village Chandlapur 2023 in Siddipet District : చుట్టూ పచ్చటి పంట పొలాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ద్వీపాన్ని తలపించే సాగరం.. అడుగడుగునా హరిత సంపద.. గుట్టపై రంగనాయకుడు.. ఇలా ఎన్నో విశేషాల సమాహారమే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామం. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పల్లె.. జాతీయ స్థాయిలో మెరిసింది. ఈ ప్రాంత ఖ్యాతిని నలుదిశలా చాటింది. కేంద్రం ప్రకటించిన ఉత్తమ పర్యాటక గ్రామాల్లో రాష్ట్రం నుంచి జనగామ జిల్లాలోని పెంబర్తితో పాటు చంద్లాపూర్‌ ఎంపికయ్యాయి. ఈ మేరకు రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నేతృత్వంలో దిల్లీలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందింది.

Best Tourism Villages Telangana 2023 : చంద్లాపూర్‌ ప్రత్యేకత చెప్పాలంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రంగనాయక సాగర్‌ గురించి. చంద్లాపూర్‌, లింగారెడ్డిపల్లి, పెద్ద కోడూరు, రామంచ, ఇమాంబాద్‌ గ్రామాల సరిహద్దులను కలుపుతూ మొత్తం 2 వేల 217 ఎకరాల్లో జలాశయాన్ని నిర్మించారు. రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు సారథ్యంతో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తైంది. గోదారమ్మ నీళ్లు.. మధ్యన కొండ, గుట్టల ప్రాంతంతో ఓ ద్వీపాన్ని తలపిస్తుంది. జలాశయం చుట్టూ 8.65 కిలో మీటర్ల మేర కట్టను తీర్చిదిద్దారు. జలాశయం మధ్య ద్వీపం మాదిరి (50 ఎకరాలు) ఉన్న స్థలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

National Awards for Korutla Municipality : తెలంగాణకు వన్నె తెచ్చిన కోరుట్ల.. 4 ఏళ్లు.. 7 జాతీయ అవార్డులు

Chandlapur, Pembarthi Best Tourism Villages Telangana : ప్రస్తుతం ఇక్కడ నీటి పారుదల శాఖ అతిథి గృహం, ఎస్‌ఈ కార్యాలయం కొనసాగుతున్నాయి. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం దండిగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాగర్‌ చెంతన రూ.125 కోట్లతో పర్యాటకశాఖ అభివృద్ధి పనులు చేపట్టింది. అవి పూర్తైతే ఆహ్లాదానికి చిరునామాగా మారనుంది. సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు.. ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది.

Bhoodan pochampally: ఖండాంతరాలు దాటిన ఖ్యాతి.. ఉత్తమ పర్యాటక పురస్కారం అందుకున్న పోచంపల్లి

ఆదర్శంగా నిలిచాం..: బెస్ట్‌ టూరిస్ట్‌ విలేజెస్‌గా రాష్ట్రం నుంచి 2 గ్రామాలు ఎంపికవగా.. అందులో చంద్లాపూర్‌ ఒకటిగా ఉండటం ఆనందంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నో జాతీయ స్థాయి పురస్కారాలను అందుకుంటున్న సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. అన్ని అంశాల్లో మన ప్రత్యేకతను చాటుదామన్నారు. రానున్న రోజుల్లో సాగర్‌ను అద్భుత పర్యాటక క్షేత్రంగా మారుస్తామని స్పష్టం చేశారు.

Panchayat awards 2023: జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెల సత్తా

Best Tourism Villages Telangana 2023 : 'బెస్ట్‌ టూరిజం విలేజ్‌' పెంబర్తి.. ప్రత్యేకతలు ఇవే..!

Last Updated : Sep 26, 2023, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.