సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడవ రాష్ట్ర స్థాయి కరాటే ఓపెన్ పోటీలను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విధ్యార్థులు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చి తమ ప్రతిభను కనబర్చారు.
అంతకు ముందు పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని కల్యాణ మండపంలో ఈ పోటీలను నిర్వహించారు. ఆత్మరక్షణ కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం విద్యార్థులు కరాటే నేర్చుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు జాతీయస్థాయిలో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి