Bandi sanjay fires on cm kcr : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ధాన్యాన్ని కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలంలో ప్రజా గోస - భాజపా భరోసా యాత్ర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వాతావరణ శాస్త్రవేత్త అని పేర్కొన్నారు. రూ.30 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.30 కోట్లు పెంచి దోచేశారని ఆరోపించారు. తెలంగాణలో దళితబంధు ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. తడిసిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలని సూచించారు. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. విద్యుత్, బస్సు, పెట్రోల్ ఛార్జీలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ తేవడమే భాజపా లక్ష్యమని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్, తెరాస కలిసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
భాజపా జెండా అంటే కేసీఆర్ కుటుంబం వణుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది భాజపా ప్రభుత్వమే. ఈ తెలంగాణ కుటుంబ పార్టీ ఏమైనా గుత్తా పట్టుకుందా..? ముఖ్యమంత్రి కేసీఆర్ వాతావరణ శాస్త్రవేత్త. ముఖ్యమంత్రి నదులకు నడక నేర్పారని మంత్రి కేటీఆర్ చెప్పుకుంటుండు.. మరి అదే ముఖ్యమంత్రి నీళ్లలో మునిగిన మోటార్లకు ఈత ఎందుకు నేర్పలేదు.? రాష్ట్రంలో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. శ్రీలంకలో ఉన్నట్టు రాష్ట్రంలో పరిస్థితి ఉంది. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- ఇదీ చూడండి: నూతన ఆవిష్కరణల్లో రెండో స్థానంలో తెలంగాణ