పరీక్షలపై భయాన్ని విడనాడి ఆసక్తి పెట్టి చదివి ఫలితాలను సాధించాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంప నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో జడ్పీటీసీ మల్లేశం ఆధ్వర్యంలో హెచ్వైడీ జగదేవ్పూర్ మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యార్థులకు పదో తరగతి జీవితంలో ఓ మలుపులాంటిదన్నారు. ఇష్టంతో విద్యాభ్యాసం చేయాలని, పట్టుదలతో విజయాలు సాధించాలని సూచించారు. ఉదయమే నిద్రలేచి ఆసక్తితో చదివితే గుర్తుంటుందని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ రోజా శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, డీఈవో రవికాంత్ రావు పాల్గొన్నారు.