ETV Bharat / state

దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం

దుబ్బాక ఉపఎన్నిల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిద్దిపేట జిల్లాలోని ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ భారతి హోళికేరి కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్​ కోసం నియమించిన సిబ్బంది ఎన్నికల కమిషన్​ నిబంధనల మేరకు ఉదయం 5 గంటలకల్లా లెక్కింపు కేంద్రానికి రావాలని సూచించారు.

awareness on  dubbaka by election vote counting  by siddipeta collector bharati holikeri
దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Nov 7, 2020, 8:30 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఎన్నికల సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ భారతి హోళికేరి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. లెక్కింపు ప్రక్రియలో 14 టేబుళ్లలో 23 రౌండ్లలో కౌంటింగ్​ ఉంటుందని కలెక్టర్​ భారతి హోళికేరి తెలిపారు. కౌంటింగ్​ కోసం నియమించిన సిబ్బంది ఎన్నికల కమిషన్​ నిబంధనల మేరకు ఉదయం 5 గంటలకల్లా లెక్కింపు కేంద్రానికి రావాలని సూచించారు.

జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని కలెక్టర్​ పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే రిటర్నింగ్​ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని హోళికేరి తెలిపారు.

ఇదీ చదవండి: పరిశోధన ఫలితాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి: వెంకయ్య నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.