సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి శనీశ్వరాలయంలో శని త్రయోదశి సందర్భంగా తైలాభిషేకంతో పాటు విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. శనీశ్వరునికి తైలాభిషేకం, శని దోష పూజలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో భక్తులతో పూజలు చేయించారు. అనంతరం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: సగం ధరకే కొవిడ్ పరీక్ష.. గంటల వ్యవధిలో వైరస్ నిర్ధారణ