వర్గల్ విద్యా సరస్వతి ఆలయ 29వ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ శంభుని గిరిపై వెలసిన విద్యా సరస్వతి అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు.
అర్చనలు, పూజలతో పాటు ఆలయ ప్రాంగణంలో చండీ హోమం, లలిత పారాయణ కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ శారదా స్మారక వేద విద్యాలయ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు అనంతగిరి శర్మ, శశిధర శర్మ, నాగరాజ శర్మ పాల్గొన్నారు.