ETV Bharat / state

సిద్దిపేటలో అమర్​నాథుడి దర్శనం! - సిద్దిపేటలో శివరాత్రి పండుగ ప్రత్యేక దర్శనం

మంచు కొండల్లో కొలువైన అమర్​నాధుడిని చూడాలంటే కొండలన్నీ దాటుకొని వెళ్లాలి. చలిని సైతం లెక్క చేయకుండా ఓంకార స్మరణతో అమర్​నాథ్ యాత్ర చేస్తారు. అయితే.. అందరికీ.. అమర్​నాథ్ వెళ్లే తీరిక, సౌలభ్యం ఉండదు. అలాంటివారంతా ఇప్పుడే సిద్దిపేటకు బయల్దేరండి.

Amarnath's vision in Siddipet maha shivaratri festival time
సిద్దిపేటలో అమర్​నాథుడి దర్శనం!
author img

By

Published : Feb 20, 2020, 6:17 PM IST

అమర్​నాథ్ యాత్ర చేయాలన్న కోరిక ఉండి.. అంతదూరం వెళ్లలేని వారికి సిద్దిపేట ధార్మిక సంస్థ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ సెట్టింగులతో అమర్​నాథ్ యాత్ర అనుభూతిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మంచుకొండలు, అమర్​నాథ్ గుహ, మంచులింగం, ద్వాదశ లింగాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ కళాకారులతో భారీ మంచు కొండల సెట్టింగులు నిర్మిస్తున్నారు. అమర్​నాథ్ ఆలయం నుంచి తెచ్చిన త్రిశూలం, మంచులింగం, ద్వాదశ లింగాలను భక్తులు శివరాత్రి రోజు దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దూరం నుంచి నిజమైన మంచు కొండలేనేమో అనుకునేలా ఈ సెట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు.

ఎత్తైన శివలింగం ఏర్పాటు..

అంతేకాదు.. అమర్​నాథ్ యాత్రలో వచ్చే పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలైన పహెల్​గామ్, చందన్ వడీ, శేష్​నాగ్, పంచతరణి వంటి ప్రదేశాల నమూనాలను కూడా నిర్మిస్తున్నారు. బెంగళూరుకు చెందిన కళాకారులతో దేశంలోనే ఎత్తైన శివలింగం నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాధవానంద సరస్వతి, మధుసూదనానంద సరస్వతి,విద్యాశంకర సరస్వతి, కృష్ణజ్యోతి స్వరూపానంద సరస్వతి, దుర్గాప్రసాద్ స్వామి, శివాచార్య మహాస్వామి మొదలగు ప్రముఖ పీఠాధిపతులు పాల్గొంటున్నారు.

జాగారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

నిత్య బిల్వార్చన, నిత్య అభిషేకాలు, లక్ష పుష్పార్చన, శివపార్వతుల కల్యాణం, కుంకుమార్చన వంటి పూజాదికాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతీ భక్తుడికి మహా లింగానికి అభిషేకం, బిల్వార్చన చేసే అవకాశం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి జాగారం చేసే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 400 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సిద్దిపేటలో అమర్​నాథుడి దర్శనం!

ఇదీ చూడండి : సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల ప్రచారం.. జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.