దేశ భక్తులపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి దేశ భక్తుల దినోత్సవంగా నిర్వహించాలని వంశీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. నేతాజీ జీవిత రహస్యాలను బయటపెడతామని 2014లో అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించి ఆరున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఆయన కోరారు.
ఇదీ చదవండి: ఎన్ని పరిశ్రమలొచ్చినా వ్యవసాయమే ఆధారం: కిషన్ రెడ్డి