సిద్దిపేటలో ఐటీ టవర్ల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. రూ.45 కోట్లతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ టవర్లలో తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు.. శంకుస్థాపన రోజే నాలుగు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తాత్కాలిక భవనాలిస్తే.. నెల రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీల ప్రతినిధులు ప్రకటించడంతో సిద్దిపేట ఐటీ టవర్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు సిద్దిపేటలో ఏది చేసినా ఆదర్శంగా చేస్తారు. దీంతో సిద్దిపేటలో నిర్మించబోయే ఐటీ టవర్లు ఎలా ఉండబోతున్నాయా అన్న ఆలోచన అందరిలో మొదిలింది. దీనికి పరిష్కారంగా అధికారులు గ్రాఫిక్స్‌తో రూపొందించిన నమూనాలు విడుదల చేశారు.
ఇదీ చూడండి : సిద్దిపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్