రాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం పట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచభూతాలకు ప్రతీకలుగా 5రంగులతో ముగ్గు వేశారు. పట్నం అగ్నిగుండాలను దాటేందుకు భక్తులు పోటీ పడ్డారు.
పట్నం అగ్నిగుండాలు దాటితే తమ కష్టాలు తీరి సంతోషంగా ఉంటామని భక్తుల విశ్వాసం. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే: కె. లక్ష్మణ్