సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీలోని లచ్చపేటలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అంతకముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతనంగా నిర్మించిన వ్యవసాయ కార్యాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో కలసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం వద్ద ఉన్న మున్సిపాలిటీ కార్మికులతో వారి జీతభత్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: 'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'