సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ వద్ద జరుగుతున్న గౌరవెల్లి పంప్‌హౌస్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పంప్ హౌస్ పనుల్లో భాగంగా సొరంగంలో ఉట నీటిని బయటికి పంపే పైప్లైన్లు ప్రమాదవశాత్తు పేలిపోయాయి. కింద పనిచేస్తున్న కార్మికులపై ఆ పైపులు పడ్డాయి.
ఈ ఘటనలో వరంగల్‌కు చెందిన వంగ రమేశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి