సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పురోగతిపై చర్చ..
శనివారం పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కాలనీలో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం, సీసీ రహదారులు, తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. నిర్మాణ పనులను బ్లాకుల వారీగా విభజించుకుని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.