సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్లకు చెందిన వెల్దండి రాములు నిన్న అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఉపాధి కోసం గుజరాత్ వెళ్లిన ఒక్కగానొక్క కొడుకు లాక్డౌన్ కారణంగా తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేని పరిస్థితి.
భర్త అంత్యక్రియలు నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వలేక రోదిస్తున్న మృతుడి భార్య లసులమ్మ కన్నీరు... చూపరుల హృదయాలను కలిచివేసింది. కొందరు ముందుకొచ్చి తలాకొంత వేసుకుని ఆమెతో తలకొరివి పెట్టించారు. తండ్రి చివరి చూపు నోచుకోని మృతుని కుమారుడు కనకయ్య లైవ్ వీడియోలో తండ్రి అంతక్రియలు చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.