రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంత్రుల నివాసం ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇల్లు ముట్టడించాలని నిర్ణయించుకున్నామని.. సమస్యలు పరిష్కరించే వరకు ఇలాంటి ధర్నాలు రాస్తారోకోలు పెద్ద ఎత్తున ఉద్ధృతంగా చేస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు.
సీపీఐ సీపీఎం ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముట్టడి ప్రయత్నించారు. వారిని అడ్డుకునే పరిస్థితుల్లో పోలీసులకి ఉద్యమకారులకి మధ్య తోపులాట జరిగింది. మహిళా కండక్టర్ తోపులాటలో పడిపోయింది. ఆమెను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఆర్టీసీ జేఏసీ కార్మికులు వచ్చి మంత్రి ఓఎస్డీ బాలరాజుకు వినతిపత్రం ఇచ్చారు. మా సమస్యను హరీష్ రావు తెలియజేయండి అంటూ ఓఎస్డీ వేడుకున్నారు.
ఇదీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడికి జగ్గారెడ్డి యత్నం... దారిలో అరెస్ట్