అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీసులు పట్టుకున్నారు. రామవరం గ్రామంలో పోలీసులు సోదాలు నిర్వహించగా... డిడిగం వెంకటేశ్, డిడిగం రవితేజ ఇళ్లలో రూ.30 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
5 సంచుల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని.. ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అమ్మినా... ఇతర ప్రదేశాలకు సరఫరా చేసినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ సోదాల్లో హుస్నాబాద్ సీఐ రఘు, ఎస్సై రవి పాల్గొన్నారు.