సిద్దిపేట పురపాలక సంఘం బరిలో 236 మంది అభ్యర్థులు నిలిచారు. 361 మంది నామినేషన్లు వేయగా... ఉపసంహరణల అనంతరం 236మంది పోటీలో ఉన్నారు. పట్టణంలో 43 వార్డులు ఉండగా.. తెరాస అన్ని వార్డుల్లోను పోటీలో ఉంది.
భాజపా 40, కాంగ్రెస్ 30, ఎంఐఎం 4వార్డుల్లో పోటీ చేస్తుండగా... సీపీఎం, సీపీఐ ఒక్కో వార్డులో బరిలో ఉన్నాయి. గజ్వేల్లోని 12వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికలో తెరాస, భాజపా, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు