సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మాంటెస్సోరి పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా 150 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో గ్రామానికి చెందిన 100 మందికి పైగా సైనికులు దేశానికి సేవ చేస్తుండటాన్ని గౌరవ సూచికగా భావించి గ్రామంలోని బురుజును త్రివర్ణ పతాక రంగులతో అలంకరించారు. గ్రామంలోని విద్యార్థులు బురుజు వద్ద ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం