ETV Bharat / state

11 Years Boy Complaint: సైకిల్​ పోయిందని ఠాణాలో పిల్లాడి ఫిర్యాదు.. అసలు ట్విస్ట్​ ఏమిటంటే..? - వింత ఫిర్యాదు

11 Years Boy Complaint: సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్​స్టేషన్​లో ఓ వింత ఫిర్యాదు నమోదైంది. ఓ పదకొండేళ్ల పిల్లాడు.. తన సైకిల్​ పోయిందని పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చాడు. ఇంటి ముందే పెట్టిన సైకిల్​.. ఊరు వెళ్లి తిరిగొచ్చేలోపు కనిపించకుండా పోయిందని.. వెతికిపెట్టాలని కోరాడు. తనకు ఎంతో ఇష్టమైన సైకిల్​ పోతే.. కంప్లైంట్​ ఇచ్చాడు ఇందులో వింతేముంది అంటారా.. అందులోనే అసులు ట్విస్ట్ ఉంది..​ ఏంటంటే..?

11 Years Boy Complaint on bicycle theft in bejjanki police station

author img

By

Published : Jan 20, 2022, 5:28 PM IST

సైకిల్​ పోయిందని ఠాణాలో పిల్లాడి ఫిర్యాదు..

11 Years Boy Complaint: తమ ప్రాణాలకు ముప్పు ఉందనో.. భూములను కబ్జా చేశారనో.. దొంగలు పడి ఇళ్లంతా దోచుకుపోయారనో.. ఇలా రోజూ ఎన్నో కారణాలతో చాలా మంది పోలీస్​స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేస్తుంటారు. మరికొన్నిసార్లు కొందరు పోలీస్​స్టేషన్​కు వెళ్లేందుకు వెనకడుగు వేస్తుంటారు. పెద్దవాళ్లే వెనకాముందవుతుంటే.. ఓ పదకొండేళ్ల కుర్రాడు మాత్రం ధైర్యంగా పోలీస్​స్టేషన్​కు వెళ్లాడు. తన సైకిల్​ పోయిందని.. వెతికిపెట్టాలని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో చోటుచేసుకుంది.

చేతులు దులిపేసుకున్న నాన్న..

బెజ్జంకికి చెందిన అశోక్, రజిత దంపతుల కుమారుడు సాత్విక్. స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇంటి బయట తన సైకిల్​ను ఉంచిన సాత్విక్​.. సంక్రాంతి పండుగకు అమ్మమ్మ ఊరికి వెళ్లాడు. పండుగ తర్వాత తిరిగి వచ్చి చూస్తే.. సైకిల్​ లేదు. చుట్టుపక్కలా అంతటా వెతికాడు. స్నేహితులను ఆరా తీశాడు. ఎలాంటి ఫలితం లేదు. వాళ్ల నాన్నను అడగ్గా.. "నాకు తెలియదు. నేను నీకు కొనిచ్చినా.. నువ్వే ఎక్కడ పెట్టి మర్చిపోయావో..? నువ్వే పోగొట్టుకున్నావు కదా.. నువ్వే వెతుక్కోపో.."​ అని చేతులు దులిపేసుకున్నాడు.

ధైర్యంగా పోలీస్​స్టేషన్​కు..

ఎవ్వరిని అడిగినా ఫలితం లేకపోవడంతో.. సాత్విక్​ ఓ నిర్ణయానికి వచ్చాడు. స్నేహితులు, తెలిసిన వాళ్ల సహాయం తీసుకొని నేరుగా ఠాణాకు వెళ్లాడు. ఎలాంటి భయం లేకుండా ఓ పిల్లాడు పోలీస్​స్టేషన్​కు రావటాన్ని గమనించిన ఎస్సై ఆవుల తిరుపతి.. దగ్గరికి పిలిపించుకొని ఆరా తీశాడు. సాత్విక్​ తన సమస్యను మొత్తం ఎస్సైకి వివరంగా చెప్పాడు. సాంతం విన్న ఎస్సై.. సాత్విక్​ తండ్రి అశోక్​తో చరవాణిలో మాట్లాడాడు. అప్పుడు అసలు విషయం తెలిసింది.

బయట తిరగకుండా ఉంచేందుకు..

సాత్విక్​కు సైకిల్​ తొక్కటమంటే మహాఇష్టం. ఇప్పుడు ఎలాగూ సెలవులే ఉడంటం వల్ల.. ఇక వీధులన్నీ తనవే అన్నట్టు తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు ఎంత వారించినా.. వినకుండా సైకిల్​ తొక్కుతూనే కాలక్షేపం చేస్తుంటాడు. అయితే.. ఇప్పుడు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. బయట ఎక్కువగా తిరగకుండా చూసుకోవాలని తండ్రి ఓ ప్లాన్​ వేశాడు. సాత్విక్​ సైకిల్​ను తనకు తెలియకుండా దాచి ఉంచితే.. బుద్ధిగా ఇంట్లోనే ఉంటాడని ఊహించాడు. అందుకే సైకిల్​ను ఇంట్లోనే దాచి ఉంచామని ఎస్సైకి సాత్విక్​ తండ్రి చెప్పాడు.

అశోక్​ను ఠాణాకు పిలిపించి సైకిల్​ను సాత్విక్​కు అప్పగించారు ఎస్సై. బయట ఇష్టానుసారంగా తిరగొద్దని.. అమ్మానాన్నల మాట వినాలని హెచ్చరించారు. బాగా చదువుకోవాలని సూచించిన ఎస్సై.. తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.