ETV Bharat / state

మొక్క నాటిన ఎమ్మెల్యే... నీళ్లు పోసిన ఎమ్మెల్సీ - తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం

హరితహారంలో నాటుతున్న ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొదటిరోజు 5వేల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు.

Zeherabad MLA Manikrao Participated 6th Term Harithaharam programme
పచ్చని చెట్లు... ప్రగతికి మొట్లు
author img

By

Published : Jun 25, 2020, 1:21 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆరోవిడత హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే మాణిక్​రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే మొక్కను నాటగా, ఎమ్మెల్సీ నీళ్లు పోశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలలో కనీసం 3 నుండి 5 మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెల్లడించారు.

పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొదటి రోజు ఐదు వేల మొక్కలు నాటినట్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి రమేష్ బాబు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ క్షేత్ర అధికారి విజయ రాణి, తహసిల్దార్ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహా రెడ్డి, మెప్మా ఉద్యోగులు, మాజీ కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.