ETV Bharat / state

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించారు. గాంధీనగర్​లో చేపడుతోన్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

zaheerabad mla manik rao
zaheerabad mla manik rao
author img

By

Published : Apr 28, 2021, 4:50 PM IST

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెచ్చిస్తోందని ఎమ్మెల్యే మాణిక్ రావు పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలోని గాంధీనగర్​లో చేపడుతోన్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తమ ప్రాంతానికి రోడ్డును మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని.. ప్రజలంతా కొవిడ్​ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరిస్తూ.. మహమ్మారి కట్టడికి తమ వంతు బాధ్యత వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.