సంగారెడ్డి జిల్లా రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పోచయ్య.. అతని భార్యతో గత కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. బుధవారం వారిద్దరూ మరోసారి గొడవపడటం వల్ల బాలమ్మగిద్దె చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీశారు. బాలమ్మ అపస్మారక స్థితికి చేరుకోవడం వల్ల 108 అంబులెన్స్ సహాయంతో ఆమెను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు, పోలీసులు వెల్లడించారు.