సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్న సాగర్ గ్రామ శివారులో లారీ ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఇద్దరికి గాయాలయ్యాయి. పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన లింగం, రేణుకలు దంపతులు. రేణుక తండ్రి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిని పరామర్శించేందుకు భర్త లింగం, అత్తతో కలిసి రేణుక ఆటోలో బయలుదేరింది.
అన్న సాగర్ గ్రామ శివారులో కి రాగానే వీరు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారికి గాయాలు కావడం వల్ల జోగిపేట ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త లింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి