ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యతని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పట్టణాల్లో ఓటరు శాతం పెంచేలా ఇప్పటికే అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టామన్నారు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. ఓటు హక్కుపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని హనుమంతరావు కోరారు.
పురపాలిక ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా.. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు