రెవిన్యూ శాఖలో ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... వీఆర్వోల చేతిలో దస్త్రాలు తహశీల్దార్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వీఆర్వోల నుంచి తహసీల్దార్లు మధ్యాహ్నం 3 గంటల లోపు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రక్రియ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరిగింది. దస్త్రాలు స్వాధీనం చేసుకొని... జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తహసీల్దార్లు తెలిపారు.