గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఇసుకబావి వద్ద వరద ఉద్ధృతికి మంగళవారం రాత్రి కారు కొట్టుకుపోయింది. ఘటనలో ఆనంద్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, మత్స్యకారుల సాయంతో ఆనంద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
ఈ క్రమంలో అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత బాధిత కుటుంబీకులను పరామర్శించడానికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని దుర్భషలాడారు. తమ బిడ్డ గల్లంతై మూడు రోజులవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని.. ఇక్కడికి ఏ ప్రభుత్వ వాహనం వచ్చినా తగులబెడుతామంటూ హెచ్చరించారు.