సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని జూకల్ గ్రామంలో అర్బన్ పార్కు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ శివారులోని 500 ఎకరాల అటవీ భూముల్లో అర్బన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ఫారెస్టు అధికారులు తెలిపారు. పార్కులో వాచ్‌టవర్, యోగా షెడ్, 15 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్, చిన్నారులు ఆడుకోడానికి ఆటస్థలం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పార్కు నిర్మాణంలో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఎనిమిది కిలోమీటర్ల మేర జాలీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రెండు కిలోమీటర్ల మేర గోడ నిర్మించనున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో వీడ్ రిమూవల్ పనులను 50 మంది కూలీలతో చేస్తున్నారు. మొత్తం 500 ఎకరాల్లో పార్క్ నిర్మాణం చేస్తున్నట్లు ఎఫ్ఆర్వో దేవీలాల్, ఎఫ్ఎస్వో మల్లేశం, ఎస్‌బీవో ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: పెండింగ్ మ్యుటేషన్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి: ప్రభుత్వం