ETV Bharat / state

వాగులో బాయిలర్‌ కోళ్లను వదిలిన గుర్తుతెలియని వ్యక్తులు - pastanpur village sangareddy district

చికెన్‌ తింటే కరోనా వస్తోందన్న ప్రచారం నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి. చికెన్‌ డిమాండ్‌ తగ్గిన కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదెలైంది. బుధవారం కొందరు వ్యక్తులు పస్తాపూర్ నారింజ వాగులో వందల బాయిలర్‌ కోళ్లను వదిలి వెళ్లారు.

unknown persons Abandoned hundreds of chicken breeds at pastanpur village sangareddy district
వాగులో బాయిలర్‌ కోళ్లును వదిలిన గుర్తుతెలియని వ్యక్తులు
author img

By

Published : Mar 20, 2020, 7:09 PM IST

చికెన్‌కు డిమాండ్‌ లేకపోవడం వల్ల పౌల్ట్రీ వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో కోళ్లను అడవుల్లో, వాగుల్లో వదిలి వెళ్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామం సమీపంలోని నారింజ వాగులో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు సుమారు ఆరు వందల బాయిలర్ కోళ్లను వదిలి వెళ్లారు. ఇందులో సగానికి పైగా మృతి చెందిన కోళ్లు ఉన్నాయి. బతికున్న కోళ్లను సమీప గ్రామాల ప్రజలు పట్టుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకుని నారింజ వాగులో జేసీబీతో భారీ గుంత తీసి కోళ్లను దాంట్లో పూడ్చి పెట్టారు. చనిపోయిన కోళ్లను గ్రామాలకు సమీపంగా పూడ్చడం వల్ల కరోనా లాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం అల్గోల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కోళ్లను ఇలాగే వదిలి వెళ్లారు. ఈ రోజు పస్తాపూర్‌లో మళ్లీ పారేసి వెళ్లారు. ఈ చర్యలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకొవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

వాగులో బాయిలర్‌ కోళ్లును వదిలిన గుర్తుతెలియని వ్యక్తులు

ఇదీ చూడండి: బాణసంచా పరిశ్రమలో పేలుడు-ఆరుగురు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.