ETV Bharat / state

విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువతుల మృతి - చెరువులో పడి ఇద్దరు మృతి

two members accidently fell in the pond and they died
విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువతుల మృతి
author img

By

Published : Aug 26, 2020, 3:05 PM IST

Updated : Aug 26, 2020, 5:10 PM IST

14:43 August 26

విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువతులు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. దుస్తులు ఉతికేందుకు వెళ్లి... ఈత చేయాలన్న సరదాతో చెరువులోకి దిగిన ఇద్దరు యువతులు మృత్యువాత పడ్డారు.

      ఐలాపూర్​ తండాకు చెందిన నలుగురు యువతులు దుస్తులు ఉతికేందుకు చెరువుకు వెళ్లారు. అనంతరం స్నానం చేసేందుకు చెరువు లోపలికి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు మునిగిపోగా... వారిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు యువతులు చెరువులో పడిపోయారు.  గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ఇద్దరు చనిపోయారు. మృతులు వరలక్ష్మి, చిట్టిగా గ్రామస్థులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పఠాన్​చెరు ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Aug 26, 2020, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.