ETV Bharat / state

ఆన్​లైన్ క్లాసులు వద్దట.. ఆఫ్​లైన్ తరగతులే ముద్దట! - survey about online classes

ఆన్​లైన్ విద్యాబోధన పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు సైతం విముఖత చూపిస్తున్న టీఎస్​యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఆన్​లైన్ క్లాసుల వల్ల కలిగే లాభ, నష్టాలపై వీరు సర్వే నిర్వహించారు. ఆఫ్​లైన్ విద్యనే అందించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

tsutf-survey-about-online-classes-in-sangareddy
'విద్యార్థులు ఆన్​లైన్ విద్యాబోధన అర్థం కావట్లేదంటున్నారు'
author img

By

Published : Jul 8, 2020, 6:25 PM IST

సంగారెడ్డి జిల్లాలో పాఠశాలలను తెరవాలా వద్దా... ఆన్​లైన్ క్లాసుల వల్ల లాభ, నష్టాలేంటి... అనే విషయంపై టీఎస్​యూటీఎఫ్ సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలను జిల్లా ఉపాధ్యాయ అధికారి వెల్లడించారు. జిల్లాలోని విద్యార్థులను, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించామని తెలిపారు.

దాదాపు 91% మంది ఆఫ్​లైన్ విద్యనే అందించాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యార్థులే కాకుండా ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఆన్​లైన్ బోధన పట్ల విముఖత చూపించారు. కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి... వివిధ ప్రాంతాల్లో ఉన్నతమైన జాగ్రత్తలతో పాఠశాలలు తెరవాలని పేర్కొన్నట్లు వెల్లడించారు.

విద్యా సంవత్సరం సున్నా కాకుండా కేరళ ప్రభుత్వం మాదిరి... రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విద్యా సౌకర్యాలు అందించాలని కోరినట్లు వెల్లడించారు. పాఠశాలలను తెరిచే క్రమంలో భవనాలను పూర్తిగా శానిటైజ్ చేసి, మాస్కులు పంచి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్​యూటీఎఫ్ నాయకులు డిమాండు చేశారు.

ఇదీ చూడండి: 'ట్రస్ట్' పాలిటిక్స్​: చట్ట ఉల్లంఘనా? కక్షసాధింపా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.