సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 19 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. జహీరాబాద్ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే మాణిక్రావుకు అందజేశారు. బస్టాండ్ ఆవరణలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మహిళా కండక్టర్ అస్వస్థతకు గురికాగా.. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండిః మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు