ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి డిపో కార్యాలయం ఎదుట టీజేఎంయూ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం 2014, 18 ఎన్నికల్లో ఆర్టీసీ విలీనంపై ప్రకటన చేసిన.. ఇంత వరకు దానిని అమలు చేయలేదని గుర్తుచేశారు. ముఖ్యంగా కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఎంయూ యూనియన్ రెండు దఫాలు ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో గెలిచిన... కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వచ్చే ఆర్టీసీ ఎన్నికల్లో టీజేఎంయూ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: 'ఫిట్నెస్ లేకుంటే రోడ్లపైకి రావొద్దు'